Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “లైగర్” అట్టర్ ఫ్లాప్ కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. రెండో రోజుకే థియేటర్ లు ఖాళీ అయిపోయాయి. హీరోగా విజయ్ దేవరకొండ కష్టం తప్ప సినిమాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్క్ ఎక్కడ కనిపించలేదని జనాలు విమర్శలు చేశారు. వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి “లైగర్” రూపంలో భారీ పరాజయం రావడంతో అభిమానుల సైతం పూరి పనితనంపై నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడంతో… పూరి జగన్నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని అర్థం చేసుకున్న పూరీ.. వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. ఇప్పటికే ఇద్దరి అకౌంట్లలో డబ్బులు జమ చేయగా.. అప్పు చేసైన సరే మరో రెండు నెలలలో పూర్తి నష్టపరిహారం ఇస్తానని మిగతా డిస్ట్రిబ్యూటర్లకు పూరి హామీ ఇవ్వడం జరిగిందట. ఇప్పటికే సినిమాకి నష్టం రావడంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ విషయంలో కొంత వెనక్కి తిరిగి ఇచ్చేయడం జరిగింది.
పూరి జగన్నాథ్ కూడా ముందే చాలావరకు నష్టాన్ని భరించారు. ఇదిలా ఉంటే డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల చివరిలో వస్తుందని భావించిన “లైగర్” వారం ముందుగానే అనగా ఈ నెల 22వ తారీఖు నాడు స్ట్రీమింగ్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటిటి లో విడుదల చేయాలని భావించారు. కానీ సినిమా రిజల్ట్ మరి దారుణంగా రావటంతో విడుదలైన నెల కాకముందే డిస్నీ హాట్ స్టార్ లో “లైగర్” స్ట్రీమింగ్ చేసేస్తున్నారు.