NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: “పుష్ప 2” నుండి రిలీజ్ అయిన ఫస్ట్ అప్ డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నరు..!!

Share

Pushpa 2: 2021లో వచ్చిన “పుష్ప” సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి డైలాగ్స్, పాటలు, స్టెప్పులు అందరిని ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఈ సినిమాలో తగ్గేదేలే డైలాగ్… విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.

Pushpa 2 movie first update fans are in full enjoy

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో బన్నీకి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అసలు ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. అటువంటి ఈ సినిమా సెకండ్ పార్ట్ వస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మొదటి భాగం కంటే “పుష్ప” రెండో భాగం… మరిన్ని ఎక్కువ భాషల్లో సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 8వ తారీకు బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో… “పుష్ప” సెకండ్ పార్ట్ నుండి కొత్త అప్ డేట్ రాబోతున్నట్లు మేకర్స్ లేటెస్ట్ గా వీడియో రిలీజ్ చేయడం జరిగింది.

Pushpa 2 movie first update fans are in full enjoy

తిరుపతి జైలు నుండి “పుష్ప” తప్పించుకున్నట్లు ఎక్కడున్నారో తెలియదని.. బ్యాక్ గ్రౌండ్ లో ఓ వ్యక్తి చెప్పటం పోలీసులు వెతుకుతున్న వీడియో ఎంతగానో సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉంది. బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నట్లు.. చెబుతూ అసలు పుష్ప ఎక్కడ అని ఏప్రిల్ ఏడవ తారీకు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పుష్ప సెకండ్ పార్ట్ లో బన్నీ ఫస్ట్ లుక్ ఏ రకంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

హిస్టారిక‌ల్ మూవీలో అక్ష‌య్‌

Siva Prasad

Prabhas : ప్రభాస్ సలార్ లో శృతిహాసన్ కి కళ్ళు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ ..?

GRK

Catherine Tresa: కేథరీన్ హీరోయిన్ అని చెప్పుకోవడం దండగ..ఏదో ఫ్లోలో అవకాశాలు అందుకుంది..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడానికి కారణాలు ఇవేనా..?

GRK