Pushpa: కీలక సమయంలో బన్నీ తప్పటడుగులు.. అవే బిగ్గెస్ట్ మైనస్ కానున్నాయా..?

Share

Allu Arjun Pushpa: ఐదు రోజులు.. పుష్ప సినిమా రిలీజ్ కావడానికి పట్టే సమయమిది. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులను అలరించడానికి పుష్ప సిద్ధమైంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని వెండితెరపై వీక్షించేందుకు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. కానీ ఇతర భాషా ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఆసక్తి నెలకొంది అనేదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రమోషన్లకు సమయం లేక ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికి ప్రధాన కారణం బన్నీ తప్పటడుగులు వేయడమేననే ఓ టాక్ సినీ వర్గాల్లో నడుస్తోంది.

ఏంటా తప్పటడుగులు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాని డిసెంబర్ 17న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తనకు అదే డేట్ కావాలి అని బన్నీ పట్టుబట్టాడు. అందుకు సరైనన్న చిరంజీవి తన సినిమా రిలీజ్ ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసుకున్నారు. కానీ అప్పటికి పూర్తి చేయాల్సిన పుష్ప సినిమా పనులు చాలా మిగిలి ఉన్నాయి. ఉన్నట్లుండి డిసెంబర్ 17ని బన్నీ ఫైనలైజ్ చేయడంతో సుకుమార్ (Sukumar) రాత్రనకా పగలనకా సినిమా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయడానికి సుకుమార్ పడిన కష్టాలు వర్ణనాతీతమని కూడా ఒక టాక్ ఉంది. కాస్త ఆలస్యమైనా సినిమాని పర్ఫెక్ట్ గా రూపొందించాలని సుకుమార్ భావిస్తుంటారు. కానీ ఈసారి డెడ్ లైన్ ఉండటంతో హడావిడిగా సినిమా ఫినిష్ చేసేశారు. దీనివల్ల అవుట్ పుట్ పై ప్రభావం పడినట్టు తెలుస్తోంది.

అనుభవిస్తున్న పర్యవసనాలు ఏంటి?

ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే నిర్ణయంతో సుకుమార్ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సినిమా పూర్తి చేసేసరికి చాలా సమయం పట్టింది. అన్ని భాషల్లో ప్రశాంతంగా ప్రమోషన్లు చేసుకునేందుకు కూడా సమయం లేని పరిస్థితి ఏర్పడింది. ఇండియా లెవెల్ లో సినిమాని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే ఎన్ని రోజులపాటు ఎంత గ్రాండ్ గా ప్రమోషన్ చేయాలో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి తొలిసారిగా హిందీలో బన్నీ సినిమా విడుదల కాబోతుంది కాబట్టి గ్రాండ్ లాంచ్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ తక్కువ సమయంలో ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు. ఒకపక్క ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు దుమ్మురేపుతుంటే అల్లు అర్జున్ సినిమా అంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఒకవేళ సినిమాని జనవరిలో ప్లాన్ చేసినట్లయితే.. అన్నీ కూడా పక్కాగా జరిగిపోయి ఉండేవేమోననే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.

మిగిలి ఉన్న స్వల్ప సమయంలో బెంగళూరు, ముంబయి, చెన్నై, కోచి తదితర నగరాలకు బన్నీ వెళ్ళాల్సి వస్తుంటుంది. ఇంత ఒత్తిడిలో జరిగే ప్రమోషన్లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి. ఇప్పటికే బన్నీ మలయాళం, తమిళ్ పాత్రికేయులను పిలిచి ప్రమోషన్లు ఒకేసారి చేసేసారు. కానీ మిగతా భాషల సంగతేంటి? అవి ఎలా జరుగుతాయి? విస్తృతమైన ప్రమోషన్లు లేకుండా ఇతర భాషా ప్రేక్షకులను ఆకట్టుకునేదెలా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు పుష్ప సినిమా బృందాన్ని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క బన్నీ నిర్ణయం బిగ్గెస్ట్ మైనస్ కానుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.


Share

Related posts

Suma Kanakala: రాజీవ్ డైలాగ్ తో కరోనాను ఎదుర్కొనడానికి ధైర్యాన్ని నూరిపోసిన సుమ..!!

bharani jella

Eatela Rajendar: ఈట‌ల ఇలాకాలో బీజేపీ కొత్త ప్లాన్‌… దుబ్బాక రిపీట్ అవుతుంద‌ట‌

sridhar

పవన్ కల్యాణ్ తో జానీ మూవీ..! సెట్ చేసిన రామ్ చరణ్..!!

Muraliak