Pushpa: ఏ సినిమాకైనా షూటింగ్ సమయంలో అదనంగా సన్నివేశాలు చిత్రీకరిస్తుంటారు. స్క్రిప్ట్‌లో ఉన్న సీన్స్ మొత్తం షూటింగ్ చేస్తారు. అయితే టోటల్ రన్ టైమ్ చూసుకున్నప్పుడు మాత్రం ఎక్కడైనా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది అనే అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతాయి. దాంతో సెన్సార్ అయ్యాక కొన్ని సీన్స్‌ను ఎడిటింగ్‌లో లేపేస్తారు. ఆ సీన్స్ సినిమాకు ప్లస్ అయినా కూడా తప్పని పరిస్థితుల్లో తీసేయాల్సి వస్తుంది. కానీ, ఆ సీన్స్ అభిమానులకోసం మళ్ళీ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. అప్పుడు అభిమానుల నుంచి మాత్రమే కాదు, ప్రేక్షకుల నుంచి రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కామెంట్స్ ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్ విషయంలో తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప ఇటీవలే అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అలాగే అమెరికాలో రికార్డ్ స్థాయి థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మౌత్ టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ళ సునామీనే సృష్ఠించింది. హిట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ ఈ స్థాయి హిట్ అని మాత్రం ఎవరూ ఊహించలేదు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇంత భారీ కమర్షియల్ ఇంతక ముందు ఎన్నడూ దక్కలేదు. ఇప్పటీవరకు ఎన్నో సక్సెస్‌లు చూసిన మైత్రీ సంస్థ పాన్ ఇండియన్ రేంజ్‌లో ఇది తొలి సక్సెస్.
Pushpa: ఆ కారణంగా మేకర్స్ తీసేయాల్సి వచ్చింది.
ఇక తాజాగా రిలీజ్ చేసిన సీన్స్ సినిమాలో ఉండాల్సిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సీన్స్‌లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాలో ఇది కీలకమైన సన్నివేశమే. కానీ, లెంగ్త్ ఎక్కువైందనే కారణంగా మేకర్స్ తీసేయాల్సి వచ్చింది. ఈ సీన్ తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పటి నుంచి యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతూ..రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిది. దేవీశ్రీప్రసాద్ మాంచి మాస్ బీట్స్ ఇచ్చాడు. అలాగే, సమంత మొదటిసారి చేసిన స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది.