Pushpa: పుష్ప దెబ్బకి బాలీవుడ్ హీరోలకి ప్యాంట్ తడిచిపోతోంది..!

Share

Pushpa: పుష్ప దెబ్బకి బాలీవుడ్ హీరోలకి ప్యాంట్ తడిచిపోతుంది..! అంటూ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఈ సినిమా బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్స్ రాబడుతుండటమే. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ పాన్ ఇండియన్ సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ, రెండవ రోజు నుంచి అనూహ్యంగా సూపర్ హిట్ అనే టాక్ మొదలైంది.

pushpa-huge collections in bollywood
pushpa-huge collections in bollywood

అదే టాక్‌తో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంది. ఈ సినిమాకు ముందు బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రిలీజైంది. పుష్ప రిలీజ్‌కు ముందు రోజు హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోం సినిమా రిలీజైంది. అలాగే వారం తర్వాత నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజైంది. హిందీలోనూ క్రేజీ మూవీస్ రిలీజైయ్యాయి. అయినా పుష్ప రాజ్‌ను ఎవరూ ఆపలేకపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం హిందీ ఇండస్ట్రీ మీదే ఉంది. కానీ, ఎందుకనో అక్కడ సరైన ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు.

Pushpa: రికార్డులు బద్దలు కొడుతుంటే అభిమానులు ఇలాంటి కామెంట్సే కదా చేస్తుండేది.

అయినా బాలీవుడ్‌లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. నిన్నా మొన్నటి వరకు అక్కడ ప్రభాస్ ఒక్కడే సత్తా చాటారు. ఇప్పుడు మన ఐకాన్ స్టార్ కూడా బాలీవుడ్ మార్కెట్ మీద దండయాత్ర చేస్తున్నాడు. దాంతో అక్కడ హీరోలకు టాలీవుడ్ హీరోలు గట్టి పోటీ ఇస్తున్నారని..ఇకపై చేసే సినిమాలు మరో లెవల్ అనేలా ఉండాలని మాట్లాడుకుంటున్నారట. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాలీవుడ్‌లో పుష్ప సినిమా వసూళ్ళు చూసి అక్కడి స్టార్ హీరోలకు ప్యాంట్ తడిచిపోతుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారట. తమ అభిమాన హీరో సినిమా రికార్డులు బద్దలు కొడుతుంటే అభిమానులు ఇలాంటి కామెంట్సే కదా చేస్తుండేది.


Share

Related posts

బీహార్ దెబ్బకు తమిళనాడు హస్తంలో వణుకు

Special Bureau

సైరా అతిథులు వాళ్లేనా?

Siva Prasad

ఎస్బీఐలో బ్యాంకు లోన్ తీసుకున్నారా? మీకు గుడ్ న్యూస్.. రెండేళ్లు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు

Varun G