Pushpa: పుష్ప సినిమా హవా నేటికీ కొనసాగుతోంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా వచ్చి 5 నెలల గడుస్తున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ యాక్షన్ డ్రామాలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ పాట చాలా ప్రత్యేకమైనది. హీరోయిన్ సమంత తన కెరీర్ లో తొలిసారిగా చేసిన ఈ ఐటమ్ సాంగ్.. ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. పొట్టి పొట్టి దుస్తుల్లో సామ్ వేసిన స్టెప్పులకు కుర్రాళ్ళు కిర్రెక్కిపోయారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు కనెక్ట్ కావడం విశేషం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సామాన్యుల నుండి సెలిబ్రిటీల వరకు..
ఇక సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ ‘ఊ అంటావా’ పాటకు ఉ కొట్టలేకుండా ఉండిపోయారు. దీనికి సంబంధించిన రీల్స్ – సరదా పేరడీ సాంగ్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ పాట ఓ ఊపు ఊపింది. తాజాగా USAలో ఓ 13 ఏళ్ల చిన్నారి వయోలిన్ వాయిస్తూ ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది. ‘కరోలినా ప్రొట్సెంకో’ అనే అమ్మాయి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ సాంగ్ కు అద్భుతమైన వయోలిన్ కవర్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వయోలిన్ తో దుమ్ముదులుపుతోంది…
అంతకుముందు ఈమె చేసిన ‘శ్రీవల్లి’ వయోలిన్ వెర్సన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇపుడు తాజాగా ఈ పాటకు పెర్ఫర్మ్ చేసి అందరి దృష్టిని ఆకర్శించింది. ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్న ఈ అమ్మాయి.. ‘పుష్ప’ పాటలను ప్లే చేస్తోందంటే ఈ సినిమా క్రేజ్ ఎల్లలు దాటిందనే చెప్పాలి. ఈ సినిమాలోని సాంగ్స్ తో పాటుగా పుష్పరాజ్ గా బన్నీ మ్యానరిజం, డైలాగ్స్ మరియు సింపుల్ స్టెప్పులు దేశ విదేశాలలోని అనేక మందిని ఆకర్శించడం కొసమెరుపు. ‘తగ్గేదే లే’ అంటూ సెలబ్రెటీలు క్రికెటర్లు.. వాళ్లు వీళ్లు.. అని తేడా లేకుండా హంగామా సృష్టించారు.