pushpa movie: ఆ ప్రాంతంలో బాహుబ‌లి రికార్డును ఎడ‌మ కాలితో త‌న్నిన `పుష్ప‌`!

Share

pushpa movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా క‌నిపించ‌గా.. రావు రమేష్, అన‌సూయ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

pushpa movie break the baahubali record in australia
pushpa movie break the baahubali record in australia

ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేశారు. అయితే టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తాజాగా ఓ ప్రాంతంలో బాహుబ‌లి రికార్డుల‌ను ఎడ‌మి కాలితో త‌న్ని ప‌డేసి ఓరా అనిపించింది.

pushpa movie break the baahubali record in australia
pushpa movie break the baahubali record in australia

అస‌లు మ్యార‌ట్ ఏంటంటే.. ఆస్ట్రేలియాలో పుష్ప అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అక్క‌డ మొత్తంగా ఈ చిత్రం 5.7 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను కొల్ల‌గొట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ లో మూడు కోట్లకు పైమాటే. కేవలం ఆస్ట్రేలియాలో ఇంత భారీగా వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది నాన్ బాహుబలి రికార్డ్ గా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హిందీ మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప మూవీ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజార్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికీ థియేటర్స్ వద్ద ఈ చిత్రం అదిరిపోయే క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుండ‌టం విశేషం.

 


Share

Related posts

Dharsha Gupta New HD stills

Gallery Desk

RRR: “RRR” లో ఎన్టీఆర్ ముస్లిం గా మారటానికి కారణం అదేనట..!!

sekhar

A – ఆదిపురుష్ : అప్పుడే వివాదం షురూ .. ? తలపట్టుకున్న ప్రభాస్ ??

sekhar