Pushpa: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ(Bunny) నటించిన “పుష్ప”(Pushpa) దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. గత ఏడాది డిసెంబర్ మాసంలో విడుదల అయింది. తెలుగులో తప్ప మిగతా భాషల్లో పెద్దగా కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో.. దృష్టి పెట్టని “పుష్ప” టీంకి … సినిమా అవుట్ పుట్ కి మైండ్ బ్లోయింగ్ అయింది. ఆ భాష ఈ భాష అనే లేదు. ఆ దేశం మరియు ఈ దేశం అనే తేడా లేకుండా.. “పుష్ప”లో బన్నీ మేనరిజమ్స్.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ.. సినిమాలో బన్నీ పలికిన డైలాగ్ చాలా హైలైట్ గా నిలిచింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సెలబ్రిటీలు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టు సభ్యులు మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా తగ్గేదేలే అంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ వైరల్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు “పుష్ప” మేనరిజం ప్రపంచ రెజ్లింగ్ గేమ్ “WWE” లోకి కూడా ఎంటర్ అయ్యింది. ప్రపంచంలోనే ఈ గేమ్ కి మంచి ఆదరణ ఉంది. ఇటువంటి తరుణంలో ఇటీవల “WWE” లో…ఫైటర్ సౌరవ్ గుజ్లర్.. తన ప్రత్యర్థిని బాక్సింగ్ రింగ్ లో కింద పడేసి ఓడించాడు.
అనంతరం అల్లు అర్జున్(Allu Arjun) టైప్‌లో తగ్గేదేలే అంటూ మ్యానరీజం చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో తగ్గేదేలే మాదిరి మేనరిజం.. మరొకటి “పుష్ప” రెండో భాగంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాని చాలా భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.