Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన “పుష్ప” గత ఏడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. “పుష్ప” సాంగ్స్ పరంగా సినిమా పరంగా డైలాగులు పరంగా అన్ని రకాలుగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో బన్నీ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సెలబ్రిటీలు ఇంకా పలువురు రాజకీయ నాయకులు క్రీడాకారులు సైతం “పుష్ప” మేనరిజం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
అటువంటి ఈ “పుష్ప” సినిమా నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాలో ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకోవడం జరిగిందంట. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప అవార్డుల్లో సైతం.. దూసుకుపోవటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే పుష్ప సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. చాలా తక్కువ టైంలోనే సినిమా కంప్లీట్ చేసి ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాదు “పుష్ప” మొదటి భాగం కంటే రెండో భాగం.. అత్యధిక భాషలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఏది ఏమైనా సైమా అవార్డుల కార్యక్రమంలో పుష్ప ఏడు అవార్డులు దక్కించుకున్నట్లు వార్త రావటం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. రెండో భాగం “పుష్ప”కి సంబంధించి సాంగ్స్ ఆల్రెడీ ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఇంకా కొంతమంది దక్షిణాదికి చెందిన ప్రముఖ నటీనటులు.. ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.