Pushpa Movie: డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న “పుష్ప” పై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఫార్ములా తో వస్తున్న ఈ సినిమా లో అల్లు అర్జున్ ఫస్ట్ టైం లారీ డ్రైవర్ అదేవిధంగా స్మగ్లర్ ఆంధ్ర చేయటం సినిమా మొత్తానికే హైలైట్ గా మారింది. కెరీర్లో చాలా డిఫరెంట్ రోల్ లో బన్నీ నటించడంతో పాటు సుకుమార్ టేకింగ్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కూడా అదరగొట్టడంతో… సినిమా రిలీజ్ కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ఆగస్టు 13 వ తారీకు సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావించగా… కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో… పరిస్థితులు మొత్తం మారిపోవడం మాత్రమే కాక… కేసులు భారీగా పెరగటం థియేటర్లు క్లోజ్ అవడంతో… ఏం చేయలేని పరిస్థితి. దీంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పుష్ప .. సినిమా సెకండ్ పార్ట్ సడన్ గా తెరపైకి తెచ్చారు సుకుమార్.
ఇదిలా ఉంటే ఫస్ట్ పార్ట్ లో రష్మిక మందన కి సెకండ్ పార్ట్ లో మరో కొత్త హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే రీతిలో స్క్రిప్ట్ చేంజ్ చేసినట్లు…టాక్. రష్మిక మందన రోల్ సెకండ్ పార్ట్ లో అంతగా ఉండదు అని అంటున్నారు మేకర్స్ . పుష్పా సెకండ్ పార్ట్… మొత్తం ఫస్ట్ పార్ట్ కి భిన్నంగా ఉండే రీతిలో క్యారెక్టర్ లో కూడా చేంజ్ చేసినట్లు.. దీంతో హీరోయిన్ రష్మిక మందన కి సుకుమార్ షాక్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్.