Pushpa: 2021వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీకు “పుష్ప” విడుదల అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో బన్నీ.. సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా .. ప్రపంచ సినిమా లోకాన్ని కుదిపేసింది. ఈ సినిమాలో డైలాగులు, పాటలు, డాన్స్ అన్ని.. కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ మొదలుకొని సౌత్ వరకు కలెక్షన్స్ సునామి సృష్టించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోవడం .. “పుష్ప” రిలీజ్ అయిన టైంలోనే భారీ సినిమాలు రిలీజ్ అయినా గాని వాటన్నిటిని వెనక్కి తన్ని “పుష్ప” రికార్డు స్థాయి వసూలు రాబట్టడం అందరికీ బైర్లు కమ్మేటట్టు చేసింది.
బన్నీ కెరియర్ లో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే “పుష్ప”.. మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ప్రపంచ సినిమా రంగానికి బన్నీ ఈ సినిమాతో చాలా దగ్గర అయ్యాడు. అటువంటి ఈ సినిమాని లేటెస్ట్ గా రష్యాలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోయిన్ రష్మిక మందన బన్నీ ఇంకా నిర్మాతల బృందం… రష్యాలో ప్రమోషన్ కార్యక్రమలు నిర్వహించడానికి వెళ్లడంతో అక్కడి సభ్యుల బృందం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.
కొద్ది రోజుల క్రితం విడుదలైన “పుష్ప” రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న మాస్కో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో “పుష్ప” గ్రాండ్ ప్రీమియర్స్ వేయనున్నారు. “పుష్ప” మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తో మరింత సంచలనాలు సృష్టించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రష్యాలో సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో పుష్ప టీం మొత్తం అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.