Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” డిసెంబర్ 8వ తారీకు రష్యాలో విడుదల కానుంది. ఈ మేరకు “పుష్ప” సినిమా యూనిట్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సందడి చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుండి రష్యాలో “పుష్ప” సినిమా యూనిట్ పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వటంతో పాటు అక్కడి సినిమా ప్రేక్షకులనీ కలవడం జరిగింది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. గత ఏడాది డిసెంబర్ 17వ తారీకు రిలీజ్ అయిన “పుష్ప” ఊహించని విధంగా విజయం సాధించింది.
పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ మరియు బన్నీకి ఈ సినిమా ఫస్ట్ అయినా గాని అద్భుతమైన రెస్పాన్స్ వరల్డ్ వైడ్ గా సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయినా గానీ ₹100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో తగ్గేదేలే డైలాగ్ తో పాటు…సాంగ్స్.. పలు స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇండియాలో ఇటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకుండా కేవలం మాతృభాషలోనే చేసినా గాని ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఒన్ అండ్ ఓన్లీ సినిమా “పుష్ప”.
అటువంటి ఈ సినిమా ఇప్పుడు రష్యాలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన ఇంకా డైరెక్టర్ సుకుమార్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ నిర్మాతలు రష్యాలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో నెక్స్ట్ “పుష్ప 2” కోసం అభిమానులు సినిమా ప్రేక్షకులు భారీ ఎత్తున ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 17 పుష్ప విడుదల ఏడాదిగా వస్తూ ఉండటంతో… ఆరోజు “పుష్ప” సెకండ్ పార్ట్ కి సంబంధించి అప్ డేట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Team #PushpaTheRise has been showered with love and applause at the St.Petersburg premieres ❤️🔥
Grand Russian Language Release on December 8th 💥#ThaggedheLe #PushpaInRussia
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @4SeasonsCreati1 pic.twitter.com/IpL658h19H
— Pushpa (@PushpaMovie) December 7, 2022