Raai Lakshmi: లక్ష్మీ రాయ్.. ఈమె గురించి పరిచయాలు అవసరం లేదు. `కాంచనమాల కేబుల్ టి.వి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అడపా తడపా సినిమాలు చేసింది. కానీ, స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది.
కావాల్సినంత అందం ఉన్నా.. టాలీవుడ్లో లక్ష్మీ రాయ్‌ను దర్శకనిర్మాతలెవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ తమ సినిమాలోకి తీసుకోవాలని అనుకున్నా.. ఆమెను హీరోయిన్గా కంటే ఐటెం సాంగ్స్‌కే ఎక్కువగా తీసుకున్నారు.
దీంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుని కోలీవుడ్‌కు మఖాం మార్చేసిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ మాత్రం బాగానే గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో మతి పోగొట్టేస్తుంటుంది.
తాజాగా కూడా చిట్టి పొట్టి దుస్తులను ధరించిన ఈ భామ.. ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ ఫొటోలకు పిజులిచ్చి, అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చలికాలంలోనే చెమటలు పట్టించే విధంగా ఉన్న ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక రాయ్ లక్ష్మీ అందాలు చూసి ఆగలేగపోతున్న కుర్రాళ్ళు.. ఆమె పిక్స్‌పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరు లుక్కేసేయండి.