Naga Chaitanya : నాగచైతన్యతో మరోసారి జతకట్టనున్న రాశీఖన్నా ..!

raashi-khanna-finalized-for-naga-chaitanya-vikram-kumar-film-thank-you-here-are-the-details
Share

Naga Chaitanya : అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి “లవ్ స్టోరీ” సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మజిలీ తర్వాత నాగచైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఈ చిత్రం చేస్తుండగానే నాగచైతన్య మరొక సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా తెరకెక్కుతుంది ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.

raashi-khanna-finalized-for-naga-chaitanya-vikram-kumar-film-thank-you-here-are-the-details
raashi-khanna-finalized-for-naga-chaitanya-vikram-kumar-film-thank-you-here-are-the-details

నాగచైతన్య నటించిన మజిలీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అప్పటినుంచి కథల ఎంపిక విషయంలో నాగచైతన్య జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. విక్రమ్ చివరిగా నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమాకి దర్శకత్వం వహించారు.అదేవిధంగా అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన మనం సినిమాని కూడా విక్రమ్ దర్శకత్వం వహించారు.

నాగ చైతన్య, థాంక్యూ సినిమా:
విక్రమ్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “థాంక్యూ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని చిత్ర బృందం తెలియజేసింది. అయితే ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మరోసారి రాశీ ఖన్నా జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ మామ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా రాశీ ఖన్నా నాగచైతన్యతో కలిసి థాంక్యూ సినిమా ద్వారా మరోసారి సందడి చేయనుంది. ఈ సినిమాతో పాటు రాశీ ఖన్నా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.ఇకపోతే నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 16న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డును సృష్టించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : దేవీ నాగవల్లి రెచ్చిపోయింది..! “నా పొలంలో మొలకలొచ్చాయి… జై బాలయ్య” పిచ్చ వైరల్ కామెంట్

arun kanna

ప్రభాస్ A – ‘ఆది పురుష్’ కి బ్రేక్..? కెజిఎఫ్ ఎఫెక్ట్ మరి!

arun kanna

A – ఆదిపురుష్ : టీం క్లారిటీ.. అవన్ని అవాస్తవాలంటూ కొట్టిపారేశారుగా ..?

GRK