సినిమా

Raashi Khanna: తల్లికి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన రాశీ ఖ‌న్నా.. ధ‌రెంతో తెలిస్తే షాకే!

Share

Raashi Khanna: ఎటువంటి క‌ల్మ‌షం లేని అమ్మ ప్రేమను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం అసాధ్యం. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృదినోత్సవంగా జ‌రుపుకుంటారు. ఈ నేప‌థ్యంలోనే నేడు రెండో ఆదివారం కావ‌డంతో అంద‌రూ త‌మ త‌ల్లితో మ‌ద‌ర్స్ డేను జ‌రుపుకుంటున్నారు.

అయితే మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్ర‌ముఖ హీరోయిన్‌ రాశీ ఖన్నా తన తల్లికి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. ఈ స్పెష‌ల్ డే నాడు అమ్మ‌తోనే గ‌డ‌పాల‌నే ఉద్ధేశంతో షూటింగ్స్‌ను బ్రేక్ తీసుకుంది. కోరుకున్న‌ట్లే అమ్మ‌తో టైమ్ స్పెండ్ చేసింది. అలాగే బీఎమ్‌డబ్ల్యూ కారును అమ్మ‌కు బహుమతిగా ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌గా మారాయి. ఈ నేప‌థ్యంలోనే రాశీ త‌న త‌ల్లి ప్ర‌జెంట్ చేసి కారు ధ‌ర‌ను తెలుసుకుని నెటిజ‌న్లు షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే, ఆ విలాస‌వంత‌మైన కారు ధ‌ర అక్ష‌రాల రూ.1.40 కోట్లు. మొత్తానికి మ‌ద‌ర్స్ డే ఖ‌రీదైన గిఫ్ట్‌తోనే త‌ల్లిని స‌ర్‌ప్రైజ్ చేసిందీ బ్యూటీ.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె తెలుగుతో నాగ‌చైత‌న్యుకు జోడీగా `థ్యాంక్యూ` చిత్రంలో న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే రాశీ `యోధ` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. సిద్దార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ నవంబర్‌ 11న రిలీజ్‌ కానుంది. వీటితో పాటు రాశీ చేతిలో మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.


Share

Related posts

Liger Glimpse Review: విజయ్ దేవరకొండ “లైగర్” గ్లింప్స్ రివ్యూ

sekhar

Ghani vs Liger: గని వర్సెస్ లైగర్..మెగా హీరో సినిమాకు హైప్ లేకుండా పోయిందా..?

GRK

Prabhas: పాన్ ఇండియా హైవోల్టేజ్ మూవీ లో ప్రభాస్ తో జ్యోతిక..??

sekhar