Radhe shyam: లెజెండ్ కృష్ణంరాజు లుక్‌తో ఫ్యాన్‌లో మరో రేంజ్ అంచనాలు..

Share

Radhe shyam: సీనియర్ నటుడు డార్లింగ్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకు రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆ మధ్య భాగ్యశ్రీ పాత్రకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె ఇందులో క్లాసికల్ డాన్సర్‌గా కనిపించబోతోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ పాత్ర విక్రమాదిత్య అని ఆయన లుక్‌ను అలాగే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రేరణగా నటిస్తున్న లుక్‌ను వదిలారు.

radhe-shyam-legend krishnam raju look created expectations
radhe-shyam-legend krishnam raju look created expectations

అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రానిది కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన లుక్ మాత్రమే. ఆ మధ్య ప్రభాస్‌తో ఉన్న స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు. అయితే అది సినిమాలో లుక్ అని మాత్రం కరెక్ట్‌గా క్లారిటీ లేదు. తాజాగా చిత్రబృందం దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఆయన పరమహంస పాత్రలో కనిపించబోతున్నారు. కాషాయం దుస్తుల్లో ఓ ఋషిలా కూర్చొని ఉన్న లుక్‌ను వదిలారు. ప్రభాస్ ఈ సినిమాలో పామిస్ట్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే పూజా డాక్టర్ పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు వదిలిన లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఇందులో పాత్రలు ఉండబోతున్నాయని మేకర్స్ క్యూరియాసిటీ ఇచ్చారు.

Radhe shyam: ఈ సినిమాకు పలువురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం.

ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌లో జనవరి 14న 7 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు పలువురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. వింటేజ్ లవ్ స్టోరిగా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమాను పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. టీ సిరీస్ వారితో కలిసి ప్రభాస్ సన్నిహితులు వంశీ – ప్రమోద్ – ప్రశీద యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. పదేళ్ళ తర్వాత ప్రభాస్ చేస్తున్న కంప్లీట్ లవ్ స్టోరి అభిమానులను, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Share

Related posts

Big Breaking: రంగంలోకి సీబీఐ – మంత్రుల అరెస్టు.. మమతపై బీజేపీ గేమ్ మొదలు..!?

Srinivas Manem

Tarun : తరుణ్ మళ్ళీ హీరోగానా.. నిజమేనా..?

GRK

YSR Asara Scheme: డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభ వార్త..! దసరా ముందే వైఎస్ఆర్ ఆసరా రెండో విడత డబ్బులు..!!

somaraju sharma