బాహుబలితో ప్రభాస్ రేంజే మారిపోయింది. దీంతో ప్రభాస్ చేసే సినిమాల స్థాయి మారిపోయింది. ఏకంగా పాన్ ఇండియన్ క్రేజ్, ఇమేజ్ సాధించాడు. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో మంచి వసూళ్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ కు ఫస్ట్ లుక్ కు మంచి రెప్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ సినిమాకు అందరు టెక్నీషియన్ల పేర్లు వెల్లడించారు. కానీ.. మ్యూజిక్ డైరక్టర్ పేరు మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.
ఇప్పుడు వీరందరూ హ్యాపీ ఫీలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. ఈ సినిమాకు ఇండియన్ లెజండరీ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడని ఓ వార్త వినిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాబట్టి మేకర్స్ రెహమాన్ ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా.. లవ్ స్టోరీలకు రెహమాన్ అద్భుతమైన సంగీతం అందిస్తాడు. ఇది ఎన్నో సినిమాల విషయంల ప్రూవ్ అయింది. అయితే.. మరో గాసిప్ ప్రకారం రెహమాన్ ను నాగ్ అశ్విన్ సినిమా కోసం సంప్రదించారని కూడా అంటున్నారు.
మరి ఈ వార్తల్లో నిజమెంతుందో మేకర్స్ రివీల్ చేయాల్సిందే. నిజానికి రెహమాన్ తెలుగులో తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఎప్పుడూ ఇవ్వలేదు. మరి.. ఈ వార్తలో నిజముంటే రెహమాన్ ఈసారైనా మంచి మ్యూజిక్ ఇస్తాడేమో చూడాలి.