NewsOrbit
సినిమా

కారు ప్ర‌మాదం.. రాజ్ త‌రుణ్ ప‌రుగోప‌రుగు

రాజ్ త‌రుణ్ ఎందుకు ప‌రుగులు తీసిన‌ట్టు?

 

రాజ్‌త‌రుణ్ కారు మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని అల‌కాపురి కాల‌నీలో డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. కారులో బెలూన్లు తెరుచుకోవ‌డంతో రాజ్‌త‌రుణ్‌కి పెద్ద‌గా గాయాలు త‌గ‌ల్లేదు. రాజ్ త‌రుణ్ కారుకు జ‌రిగిన ప్ర‌మాదాన్ని అంద‌రూ త‌రుణ్‌కి జ‌రిగింద‌ని భావించారు. త‌రుణ్ త‌ల్లిదండ్రుల‌కు ఫోన్లుచేసి ప‌రామ‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. కానీ త‌రుణ్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేద‌ని అత‌ని త‌ల్లిదండ్రులు క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా చెప్పేశారు. సో అప్పుడు అంద‌రికీ రాజ్‌త‌రుణ్ పేరు గుర్తుకొచ్చింది. దానికి తోడు ప్ర‌మాదం జ‌రిగిన స్పాట్ నుంచి రాజ్‌త‌రుణ్ ప‌రుగులు తీసిన సీసీటీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో విష‌యం పూర్తిగా రాజ్‌త‌రుణ్ మీద ఫోక‌స్ అయింది.
ఎందుకు జ‌రిగింది?
అల‌కాపురి కాల‌నీలో అంత స్పీడ్‌గా కారు న‌డిపే సీన్ ఉండ‌దు. పైగా కారును ఎంత స్పీడ్‌గా న‌డిపి ఉండ‌క‌పోతే డివైడ‌ర్‌ను కొట్టుకుని ఉంటుంది?  బెలూన్లు ఓపెన్ అయి ఉంటాయి? అంత క‌న్నూమిన్నూ తెలియ‌కుండా రాజ్‌త‌రుణ్ ఎందుకు కారు న‌డిపిన‌ట్టు? ఆయ‌నేమైనా మ‌త్తులో ఉన్నారా? ఉంటే అది మ‌ద్యం సేవించిన మ‌త్తా? డ‌్ర‌గ్స్ వ‌ల్ల వ‌చ్చిన మ‌త్తా?  ఆ కారులో ఏమైనా అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డారా? ఒక‌వేళ నిజ‌మే అయితే, అది ఏంటి? అస‌లు అంత తెల్ల‌వారుజామున రాజ్‌త‌రుణ్ ఎక్క‌డికి వెళ్లిన‌ట్టు?  అనేవి అనుమానాలు. జ‌రిగింది తెల్లారుజామున కాబ‌ట్టి ఒక‌వేళ కారు రేసులులాంటివాటిలో ఏమైనా పాల్గొన్నారా? అనే విష‌యం తెలియాల్సి ఉంది.
ప‌రుగుకు అర్థ‌మేంటి?
కారు డివైడ‌ర్‌ను కాకుండా, ఎవ‌రినైనా వ్య‌క్తుల‌ను ఢీకొట్టి ఉంటే ప్ర‌మాదానికి గురైన వారు ఎమోష‌న్ అయి ఏమైనా చేస్తారేమోన‌ని పారిపోతే ఓ అర్థం ఉంది. పోనీ కారు బ్లాస్ట్ అవుతుంద‌నుకున్న‌ప్పుడు కాస్త గ‌బుక్కున కారు దిగినా అర్థం ఉంది. అదేమీ లేకుండా భ‌యం భ‌యంగా రాజ్‌త‌రుణ్ ఎందుకు ప‌రుగులు తీసిన‌ట్టు అనే దానిమీద స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.
ఇదేం హీరోయిజం…
స్క్రీన్ మీద వంద మందిని ఒంటి చేత్తో మ‌ట్టిక‌రిపించే హీరోలు, నిజ జీవితంలో చిన్న‌పాటివాటికే బెంబేలెత్త‌డం ప‌లువురికి న‌వ్వు తెప్పించింది. బాధ్య‌త‌గా ఉండాల్సిన వ్య‌క్తి ఇలా చీప్‌గా బిహేవ్ చేయ‌డం ఏంట‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.
సెల‌బ్రిటీ హోదా మామూలుగా రాదు. కానీ ఒక‌సారి వ‌చ్చాక దాన్ని కాపాడుకోవాలి. బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించాలి. ప‌బ్లిక్‌లో చీప్ అయిపోకూడ‌ద‌ని మిగిలిన వారు తెలుసుకోవ‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌గా ఉంటుంద‌నీ సామాన్య జ‌నాలు అంటున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Leave a Comment