ఇలా అయ్యిందేంటి రాజ్ తరుణ్

షార్ట్ ఫిలిం లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ అదృష్టం కలిసోంచి బిగ్ స్ర్కీన్ పై హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు.హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే బ్యూక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్‌ పెరిగిపోవడంతో వరుసగా డిజాస్టర్ అందుకుంటున్నాడు. అయితే స్టోరీల కంటే ఎక్కువగా రెమ్యూనరెషన్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమాలు ప్లాప్ అవుతున్నాయంటున్నారు.

రాజ్ తరుణ్‌తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో కి వెళ్తాడు అనే నమ్మకం ఉందేది.అలా మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు.హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి రాజ్ తరుణ్ ఖాతాలో నాలుగు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి అ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్టు లేకుండా పోయింది. దీంతో మంచి కథల్ని సెలెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడా లేక కథల్నే పట్టించుకోవడం మానేశాడా అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పటి వరకూ ఈ చేసిన సినిమాలన్ని బడా ప్రొడ్యూసర్స్ తో చేసినవే రాజుగాడు, అందగాడు, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత , రంగుల రాట్నం,లవర్. ఈ సినిమాలన్ని పెద్ద నిర్మాణ సంస్థలే నిర్మించాయి. కానీ ఇందులో ఏ సినిమా కూడా రాజ్ తరుణ్ ని ఆదుకోలేక పోయాయి.. దీంతో కుర్ర హీరో కెరీర్ కాస్త డైలమాలో పడింది. ఇలా ఇంకో రెండు సినిమాలు ప్లాప్ అయితే ఏ నిర్మాత కూడా రాజ్ తరుణ్ వంక చూడకపోవచ్చు అంటున్నారు. అర్జెంట్‌గా హిట్టు కొట్టకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రాజ్ తరుణ్ ఏం చేస్తాడో చూడాలి..