29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: ఆస్కార్ అందుకుని హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి, కీరవాణి… ఘన స్వాగతం..!!

Share

RRR: “ఆర్ఆర్ఆర్” సినిమా ఆస్కార్ అవార్డు గెలవడం తెలిసింది. ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “నాటు నాటు” సాంగ్ కి గాను ఆస్కార్ రావటం జరిగింది. దీంతో దేశం మొత్తం “RRR” టీంను అభినందించడం జరిగింది. ఆస్కార్ గెలిచిన అనంతరం ముందుగా తారక్ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. కాకా ఈరోజు తెల్లవారుజామున దర్శకుడు రాజమౌళి మరియు ఎం ఎం కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాలభైరవ తదితరులు శంషాబాద్ విమానశ్రయంలో దిగటం జరిగింది. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించటంతో శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో వీరికి ఘన స్వాగతం లభించింది.

Rajamouli and Keeravani, who reached Hyderabad after receiving the Oscars, received a warm welcome

ఇక ఇదే సమయంలో తెల్లవారుజామున కూడా అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు విమానాశ్రయానికి చేరుకున్నారు. విజిల్స్ ఇంకా చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. రాజమౌళితో మరియు కీరవాణితో సెల్ఫీలు దిగటానికి పోటీపడ్డారు. మీడియా ప్రతినిధులు మాట్లాడించాలని ఎంత ప్రయత్నాలు చేసినా రాజమౌళి ఏమీ మీడియాతో మాట్లాడుకున్న నవ్వుతూ చాలా హుషారుగా కనిపించి… ఇంటికి వెళ్లే వెహికల్ ఎక్కిన తర్వాత బయటకు మళ్ళీ వచ్చి జైహింద్ అంటూ వెళ్లిపోయారు. అనంతరం కాలభైరవ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక వైదికపై “RRR” పాటను లైవ్ లో పాడటం తమ జీవితంలో గొప్ప క్షణమని స్పష్టం చేశారు.

Rajamouli and Keeravani, who reached Hyderabad after receiving the Oscars, received a warm welcome

అదేవిధంగా ఆస్కార్ అవార్డును అందుకోవటం చిరకాలం గుర్తిండి పోయే సందర్భమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే “RRR” టీంను సత్కరించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక ఇదే సమయంలో ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబు ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మే నెలలో మహేష్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రాజమౌళి చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఆస్కార్ అవార్డు గెలవటంతో ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ పెద్దలు “RRR” సినిమా టీంని ప్రత్యేకంగా సత్కరించాలని ఆలోచన చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

కాల‌ర్ ఎగ‌రేసిన మ‌హేష్‌

Siva Prasad

Raj tharun: ఈ ట్రైలర్ ఏదో బాగుందే.. రాజ్ తరుణ్ హిట్ కోట్టేలా ఉన్నాడే ..!

Ram

Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ నయనతార రేంజ్ అంటే మామూలు విషయం కాదు..!

GRK