29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ కీలక ప్రకటన చేసిన రాజమౌళి..!!

Share

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారతదేశ చలనచిత్ర రూపురేఖలు మార్చేసిన సినిమా. ఆస్కార్ అవార్డు ఇవాళ గెలవడంతో “RRR” పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకీ ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ క్రియేట్ అయింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో నాటు నాటు సాంగ్…కీ అవార్డు రావడం జరిగింది. ఈ సినిమాకి అవార్డు రావడం కోసం దర్శకుడు రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో చేశారు. అయితే ఇప్పుడు అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. “RRR” సీక్వెల్ కి సంబంధించి విదేశాలలో పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలలో రాజమౌళి గతంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Rajamouli announced the sequel of RRR soon

కానీ లేటెస్ట్ గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్ త్వరలో రెడీ కాబోతున్నట్లు తెలిపారు. ఓ అంతర్జాతీయ ట్రేడ్‌ మ్యాగజైన్‌తో ముచ్చటించిన జక్కన సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ… “RRR” సీక్వెల్ విషయంలో వేగంగా పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. ఆస్కార్‌ విజయం ఓ దర్శకుడిగా నాపై మరింత బాధ్యతను పెంచింది. సీక్వెల్‌కు సంబంధించిన పనుల్ని మరింత వేగవంతం చేసేలా స్ఫూర్తినిచ్చింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అని పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన మీడియా సమావేశం ద్వారా చేయనున్నట్లు సమాచారం. “ఇండియానా జోన్స్” మాదిరిగా అడ్వెంచర్ తరహాలో మహేష్ బాబుని సరికొత్త పాత్రలో చూపించాలని రాజమౌళి డిసైడ్ అయ్యారట. గ్లోబల్ అడ్వెంచర్ సినిమాకు ఈ సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు టాక్.

Rajamouli announced the sequel of RRR soon

“RRR” తో ప్రపంచ సినిమా రంగంలో తనకంటూ మార్క్ క్రియేట్ కావడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని… మహేష్ సినిమాని భారీ ప్రాజెక్టు దిశగా రూపొందించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ పనులు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు మే 31 వ తారీకు… ఈ సినిమా అధికారిక ప్రకటన చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.


Share

Related posts

‘సింగిల్ స్క్రీన్ ధియేటర్లు..’ ప్రేక్షకులకు ఇక జ్ఞాపకాలేనా..?

Muraliak

‘విలనిజం’కు బై.. బై..! చేయాల్సింది వేరే ఉందంటున్న విలన్

Muraliak

Shakuntalam : ‘శాకుంతలం’ లో కలెక్షన్ కింగ్..!

GRK