కెజీఎఫ్ సినిమా వెనక మాస్టర్ బ్రెయిన్

Share

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 80 కోట్ల బడ్జట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే అదో పెద్ద సాహసంగా చూశారు. ఈ డేర్ ని చేయడంలో వెనుకాడని రాకింగ్ స్టార్ యష్, కెజీఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ట్రైలర్ తోనే మెప్పించిన ఈ చిత్ర యూనిట్, మొదటి వారమే ప్రపంచవ్యాప్తంగా 50కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించి కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా, టాక్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైస్ అన్ని ఏరియాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న కెజీఎఫ్ సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో బాహుబలి సినిమాల నిలుస్తుంది.

ఈ సినిమాలో రాకీగా కనిపించిన యష్, మాస్ ప్రేక్షకులకి డెమి గాడ్ గా కనిపిస్తున్నాడు. ప్రతి సీన్ లో హీరోయిజం ఎలివేట్ చేయడంతో బీ, సీ సెంటర్స్ లోని ఆడియన్స్ థియేటర్స్ కి రిపీటెడ్ గా వస్తున్నారు. వన్ మ్యాన్ షో చేసిన యష్, హీరోయిజంకి కొత్త అడ్రెస్ గా నిలిచాడు. టేకింగ్ నుంచి మేకింగ్ వరకూ ఈ సినిమాని బయటకి తీసుకురావడంలో 24 క్రాఫ్ట్స్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. డైలాగ్స్ కానీ రాకీ, అదే యష్ బాడీ లాంగ్వేజ్ కానీ కెజీఎఫ్ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా హెల్ప్ అయ్యింది.

అన్ని భాషల్లో థియేటర్స్ కౌంట్ పెంచుకుంటున్న ఈ సినిమా స్లో పాయిజన్ లా ఎక్కుతుంది, ఒక రీజినల్ సినిమాకి ఇంత సత్తా ఉందా అనే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్న కెజీఎఫ్ వెనక ఒక మాస్టర్ బ్రెయిన్ ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అది ఎవరిదో కాదు మనకి బాహుబలిని ఇచ్చిన రాజమౌళిదే. ఈ సినిమాతో 1800 కోట్లు రాబట్టిన రాజమౌళిని, కెజీఎఫ్ చిత్ర యూనిట్ గతంలో కలిసింది. సినిమా గురించి అడిగి తెలుసుకున్న జక్కన, 80కోట్లు రాబట్టాలి అంటే కష్టం కాబట్టి కంటెంట్ ని ఇంకాస్త స్ప్రెడ్ చేసి 2 పార్ట్స్ గా చేస్తే మొదటి భాగానికే పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి, సెకండ్ పార్ట్ కి రాబట్టేది లాభాల్లోకి వెళ్తుందని సలహా ఇచ్చాడట. సజెషన్ తో మాత్రమే ఆగకుండా హిందీలో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కి ఫోన్ చేసి మరీ కెజీఎఫ్ సినిమాకి మార్కెట్ పెంచిన రాజమౌళి, తెలుగులో స్వయంగా దగ్గరుండి మరీ ప్రొమోషన్స్ చేశాడు. జక్కన అండతోనే యష్ సినిమా ఈరోజు వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఎవరు అండగా నిలిచినా కూడా సినిమాలో విషయం లేకపోయినా, హీరోలో దమ్ము లేకపోయినా సినిమా ఆడాదు. ఆ రెండింటి విషయంలో కెజీఎఫ్ టాప్ నాచ్ లో ఉంది కాబట్టే సినిమా ఈరోజు ఇలాంటి రిజల్ట్ ని చూస్తుంది. ఈ చిత్ర యూనిట్ పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు వస్తున్న పేరు, డబ్బులు. ఇండియా వైడ్ కన్నడ సినిమా సత్తా చాటిన కెజీఎఫ్ అందరి మనసులు గెలవడమే కాకుండా కన్నడ సినిమా స్థాయిని పెంచింది. ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ త్వరలోనే వన్ ది మోస్ట్ ప్రొడక్టివ్ ఇండస్ట్రీగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Share

Related posts

రాధే శ్యామ్ లో పూజా హెగ్డే పాత్ర ఇలా ఉంటుందా ..?

GRK

Pushpa : పుష్ప కోసం అల్లు అర్జున్ అంత కష్టపడుతున్నాడంటే కేవలం సుకుమార్ కోసమే ..!

GRK

త‌మిళ ద‌ర్శ‌కుడితో ..?

Siva Prasad

Leave a Comment