సినిమా

Rajamouli: కొత్త కారు కొన్న రాజ‌మౌళి.. ధ‌రెంతో తెలుసా?

Share

Rajamouli: `బాహుబ‌లి` సిరీస్‌తో ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. మొన్నీ మ‌ధ్య `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రం మార్చి 25న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ప్ర‌స్తుతం స‌క్సెస్ జ్యోష్‌లో ఉన్న రాజ‌మౌళి.. తాజాగా ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. రాజమౌళి దగ్గర ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉండగా.. ఇప్పుడీయ‌న త‌న గ్యారేజ్ లోకి వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్‌ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక రాజ‌మౌళి కొత్త కారు ధ‌ర విష‌యానికి వ‌స్తే.. ఫ్యూజన్ రెడ్ కలర్ లో ఉన్న ఈ కారు ఖరీదు ఢిల్లీ ఎక్స్ షో రూం ప్రకారం అక్ష‌రాల రూ.44.50 లక్షలు.

పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి ఎన్నో ప్ర‌త్యేక‌మైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు. గ‌త ఏడాదే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రాగా.. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.


Share

Related posts

Bigg boss Telugu : బీబీఉత్సవం షోలో హరితేజ శ్రీమంతం? అన్నీ టీఆర్పీ ట్రిక్సేనా?

Varun G

Mahesh babu – Trivikram: ఆ తమిళ హీరో చేస్తే అల్లు అర్జున్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మహేశ్ పరిస్థితేంటి..?

GRK

krithi shetty: ఆ స్టార్ హీరోపై మ‌న‌సు పారేసుకున్న కృతి శెట్టి.. త్వ‌ర‌లో గుడ్‌న్యూస్ చెబుతుందా?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar