Rajamouli: రాజమౌళి గురించి చప్పుకుంటూ పొతే రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, మొన్నటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ అనేది వుంటుందనే విషయం ప్రపంచానికి తెలియని తెలియదంటే నమ్మశక్యం కాదు. అలాంటిది టాలీవుడ్ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించి, తెలుగు సినిమాకు సమూన్నత స్థానాన్ని కల్పించిన ఘనుడు అని చెప్పుకొని తీరాలి. నేటి నవతరం ఫిల్మ్ మేకర్లకు జక్కన్న ఓ ఎన్ సైక్లోపీడియా. ఇటీవల ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలోనూ మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళిని ఏ విధంగా కీర్తించాడో తెలియని విషయం కాదు.
ఈ క్రమంలో బాలీవుడ్ మేకర్స్ కూడా రాజమౌళిని కీర్తిస్తున్న సంగతి విదితమే. దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య రాజమౌళి తనదైన మార్కు చిత్రాలతో వారథిని నిర్మించారంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక తాజాగా బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రణ్ బీర్ కపూర్ కూడా రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వల్లే భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోందని, ఆయన వేసిన బాటలోనే ఇప్పుడ మేము పయనిస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. సాంకేతికతని జోడించి ఆయనలా అద్భుతాలు చేయాలని ప్రయత్నిస్తున్నాం ఆ చిత్ర దర్శకుడు అన్నారు.
తాజా పరిణామంలో రాజమౌళిపై ఓ అంతర్జాతీయ మీడియా దృష్టిపడింది. తాజాగా రాజమౌళిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి పలు అంశాలు మీద ప్రశ్నలు గుప్పించింది. ఈ సందర్భంగా రాజమౌళి చెప్పిన రిప్లై ఆహుతులను అలరించింది. సదరు మీడియా, హాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచన వుందా? మార్వెల్ తరహా సినిమాలని చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా, జక్కన్న దానికి సమాధానంగా ‘నో’ అని చెప్పేశాడు. ఇంకా జక్కన్న మాట్లాడుతూ… తాను భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపైన పూర్తి అవగాహన పెంచుకుని ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలు తీస్తూ వచ్చానని, అదే తనకు ఆనందాన్ని కలిగిస్తోందని సమాధానం చెప్పారట.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…