Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. బాక్సింగ్ నేర్చుకోవడం తోపాటు ఇంకా పలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ అప్పట్లో సోషల్ మీడియాలో అకిరా ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు అమెరికాలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మెగా ఫ్యామిలీలో మంచి హైట్ కలిగిన అకీరా త్వరగా స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ పవన్ కొడుకు అకీరా పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాస్ మహారాజ రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావటం జరిగింది.
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20వ తారీకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..”టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్ ఎంతగానో నచ్చిందని చెప్పకు వచ్చారు. ఈ సినిమా మరో కొత్త లోకానికి తీసుకెళ్లేలా ఉందని తెలిపారు. ట్రైలర్ చూసినా అనంతరం డైరెక్టర్ వంశీ ఫోన్ నెంబర్ కనుక్కొని మాట్లాడి ప్రశంసించడం జరిగింది. ఈ సినిమాలో నటించిన రేణు దేశాయ్ గురించి మాట్లాడుతూ మీరు సినిమాలకు దూరమై ఉండొచ్చు కానీ మాకు చాలా దగ్గరగా ఉన్నారు.
అతి త్వరలో మీ కుమారుడు అకీరా నందన్ నీ హీరోగా పరిచయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. మీ కొడుకు హీరోగా నటించే సినిమాలో మీరు తల్లిగా నటించాలని కోరారు. విజయేంద్రప్రసాద్ మాటలతో రేణుదేశాయ్ ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. ఆ తర్వాత హీరో రవితేజని పొగడ్తలతో ముంచేత్తారు. “విక్రమార్కుడు” ఇతర భాషలలో రీమేక్ చేసిన గాని ఆ చిత్రాలలో నటించిన హీరోలు ఎవరు కూడా రవితేజను మ్యాచ్ చేయలేకపోయారు. మన హీరోలు కేవలం తెలుగు కె పరిమితం కావద్దని భారత దేశ స్థాయిలో జండా ఎగరవేయాలని విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.