ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో అత్యంత భారీ బడ్కెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ..మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఎన్.టి.ఆర్ కొమరం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఫిక్షన్ కథాంశంతో కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెకిక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరెస్ తో పాటు హాలీవుడ్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. పూణే లో ఒక భారీ సెట్ ని నిర్మించి అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని రాజమౌళి సన్నాహాలు చేశారు. కాని కరోనా కారణంగా ఆ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నుంచి ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలోను షూటింగ్ జరపాలని చూశారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ జరపడం కష్టమని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ భారీ తారాగణంతో రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి యూనిట్ సభ్యులు కూడా ఎక్కువమంది అవసరం ఉంటుంది. దాంతో షూటింగ్ నిర్వహించడం సాధ్యం కావడం లేదని తెలుస్తుంది. ఈ విషయంలో పోలీసుల నుండి పర్మిషన్ కూడా రావడం కష్టంగా ఉందని తాజా సమాచారం. ఒకవైపు బాలీవుడ్.. హాలీవుడ్ నుంచి నటీ నటులు రాలేకపోవడం ..ఇక్కడ ఎక్కువమంది సిబ్బందితో షూటింగ్ నిర్వహించడం కష్టం కావడం తో రాజమౌళి కి ఏం చేయాలో తోచడం లేదట. ఒక వైపు రాజమౌళి నిర్వహించే మాక్ షూటింగ్ కోసం మిగతా దర్శక నిర్మాతలు..హీరోలు ఎదురు చూస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!