Dasara: నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని నటించిన “దసరా” సూపర్ డుపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి… విజయవంతంగా దూసుకుపోతూ ఉంది. నాని మరియు కీర్తి సురేష్ నటన చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెసేజ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు శ్రీకాంత్ ఒదేల మొదటి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకోవటం జరిగింది.
దీంతో చాలామంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్, మహేష్ వంటి వారు అభినందనలు తెలియజేయడం జరిగింది. తాజాగా గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనదైన శైలిలో దసరా సినిమాపై స్పందించారు. నాని మరియు కీర్తి సురేష్ ఇద్దరూ చాలా గొప్పగా పర్ఫామెన్స్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ప్రతి సీన్ హృదయాన్ని తాకేలా తెరకెక్కించాడు. నాని తన కెరియర్ మొత్తంలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ఇట్టే ఒదిగిపోయింది. ప్రతి నటీనటుల నటన ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా ఆటోగ్రఫీ ఫస్ట్ క్లాస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో పెద్ద హిట్ అందుకున్న సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద దర్శకుడిగా పేరు సంపాదించిన రాజమౌళి మెచ్చుకోవటంతో సోషల్ మీడియాలో “దసరా” సినిమా చర్చినియాంశంగా మారింది. బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించడం విశేషం. ఈ సినిమాలో చాలా ఉర మాస్ క్యారెక్టర్ లో నాని కనిపించడం జరిగింది. నూతన దర్శకుడిగా శ్రీకాంత్ ఒదేల… మొదటి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకోవటంతో.. చాలామంది నిర్మాతలు శ్రీకాంత్ తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “దసరా” సినిమా రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతుంది.