Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారంటే ఉండే అంచనా లు ఆకాశాన్ని తాకుతుంటాయి. సింహాద్రి సినిమా నుంచి రాజమౌళి తీస్తున్న ప్రతీ సినిమాతో తన స్టామినాని చూపిస్తూనే ఉన్నాడు. బాహుబలి సిరీస్‌తో రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. అప్పటి నుంచి రాజామౌళి దర్శకత్వంలో నటించాలని మన టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు సౌత్ భాషలలోనీ అందరు హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంత క్రేజ్ సంపాదించు కున్నారు జక్కన్న.
ఇక ఇప్పుడు ప్రపంచమంతా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అగ్ర నిర్మాత దానయ్య అత్యంత భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను నిర్మించగా ఈ నెల 25వ తేదీన 14 భాషలలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమాతో మొదటిసారిగా చరిత్రను తెరకెక్కించారు. అలాగే రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న ఫస్ట్ మల్టీ స్టారర్ మూవీ కావడం కూడా విశేషం.
Rajamouli: మహేశ్ బాబుని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో.
కాగా, ఈ సినిమా తర్వాత రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు సాగుతు న్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కొంత విరామం తీసుకొని మహేశ్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో తెరకెక్కబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయంలో రాజమౌళి స్పందిస్తూ ఇప్పుడు రూపొందిన ఆర్ఆర్ఆర్ కంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని తెలిపారు. దాంతో మహేశ్ అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా మొదలయ్యాయి. మరి మహేశ్ బాబుని రాజమౌళి ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!