NTR – Rajamouli: ఎన్టీఆర్‌ కు టైమ్‌ సెన్స్‌ లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

Share

NTR – Rajamouli: ఎన్టీఆర్‌, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. న్యూ ఇయర్ లో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 14 భాషలలో అత్యంత భారీగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నెలరోజుల నుంచి ఎన్టీఆర్‌, రామ్ చరణ్, రాజమౌళి సహా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న పాన్ ఇండియన్ సినిమా.

rajamouli-passed shocking comments on ntr
rajamouli-passed shocking comments on ntr

ఇంత పెద్ద భారీ కాస్టింగ్‌తో వస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా మీద ఊహకందనంతగా అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునే ప్రయత్నాలు జక్కన్న బృందం గట్టిగా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరవడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం అక్కడ బాగా సందడి చేసింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్‌ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

NTR – Rajamouli: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీకి నాకంటే ముందే తారక్ వచ్చాడని, తను నాకంటే సీనియర్ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎప్పుడూ గొడవపడుతుంటాడని అన్న రాజమౌళి.. తారక్‌ది చిన్న పిల్లాడి మెంటాలిటి అన్నారు. తన ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని అంటూనే టైమ్‌ సెన్స్‌ ఉండదని..ఈ విషయంలో ఎప్పుడూ తారక్‌ను తిడుతూనే ఉంటానని అన్నారు. యాక్షన్‌ అనగానే.. నా మనసులో ఏం ఉందో అదే చేస్తాడని, ఇటువంటి నటుడు దొరకడం నా ఒక్కడి అదృష్టం మాత్రమే కాదు ఇండియన్ ఫిల్మ్
ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం రాజమౌళి చెప్పుకొచ్చారు.


Share

Related posts

AP Govt: తగ్గేదిలే..! జగన్ మార్క్ కనబడాల్సిందే..!!

somaraju sharma

Paneer: నకిలీ పనీర్ ని ఇలా కనిపెట్టండి !!

siddhu

చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేస్తున్నాడు…??

sekhar