RRR: “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని భారతీయ సినిమా ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. “బాహుబలి” విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకున్న రాజమౌళి అదేస్థాయిలో “RRR” విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్.. స్టార్ట్ అయ్యి దాదాపు ఏడాది పైగానే గడిచిన సంగతి తెలిసిందే.
దీంతో మొదటి లో ఈ సినిమా గత ఏడాది జూన్ మాసంలో రిలీజ్ అవుతుందని ప్రకటన చేయగా షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలు గాయాలపాలు కావడంతో షూటింగ్ ఆలస్యం అవ్వటం తో పాటు ఎన్టీఆర్ హీరోయిన్.. పాత్ర విషయంలో కూడా లేట్ అవ్వటం తో మరింత ఆలస్యం అయింది. ఆ తర్వాత మహమ్మారి కరోనా వైరస్ రావటంతో దెబ్బకి లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. ఇదిలాఉంటే ఇటీవల ఈ ఏడాది దసరా కి సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో కూడా వాస్తవం లేదని సంక్రాంతి పండుగకు వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు మెగా నందమూరి ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు.
Read More: RRR: “RRR” కోసం “మగధీర” ప్లాన్ వేసిన రాజమౌళి..!!
పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగకు కూడా కష్టమేనని సరికొత్త ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయంలోకి వెళితే ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలు భారీ ఎత్తున చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యి.. కొద్దిగా టైం తీసుకున్నట్లు దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు అనగా బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయిన రోజు.. విడుదల చేయాలని బాహుబలి సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ లేటెస్ట్ టాక్.