మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు వేసవి నెలలో ప్రారంభం కాక ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. మరోపక్క ఈ సినిమా తర్వాతే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలని మహేష్ డిసైడ్ అయ్యారు. ఏటువంటి డిస్టబెన్స్ లేకుండా పూర్తిగా రాజమౌళి ప్రాజెక్ట్ కే టైం కేటాయించాలని మధ్యలో ఎటువంటి ప్రాజెక్టులు చేయకుండా పూర్తి చేయాలని మహేష్ ప్లానింగ్.
అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ అయ్యాయి. దీంతో ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. మరోపక్క రాజమౌళి.. మహేష్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్.. మొత్తం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో జనవరి నెలలో.. మహేష్ సినిమా స్టార్ట్ చేయాలని జక్కన్న ప్లానింగ్ అంట. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరగా స్టార్ట్ చేయాలని మహేష్ పై రాజమౌళి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు నెల చివరిలో “SSMB 28” రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడితే దాదాపు ఆరు నెలల టైం పట్టే అవకాశం ఉంది. దీంతో తన సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవికి వెళ్లే పరిస్థితి ఉండటంతో రాజమౌళి… త్రివిక్రమ్ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని.. మహేష్ కి కీలక సూచనలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమాని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసే యోచనలో రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. “బాహుబలి”, “RRR” అభిమానులను మించిపోయో రీతిలో భారీ బడ్జెట్ తో మహేష్ సినిమా జక్కన్న రూపొందించనున్నట్లు ఇండస్ట్రీ టాక్.