18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Rajamouli: న్యూయార్క్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్న రాజమౌళి..!!

Share

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలు భారతీయ చలనచిత్ర రంగం రూపురేఖలను మార్చేస్తున్నాయి. బాహుబలి 2, “RRR” రెండు కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం తెలిసిందే. ఈ సినిమాల చిత్రీకరణ విదేశాలను ఎంతగానో ఆకట్టుకుంది. “RRR” కంటే బాహుబలి పెద్ద హిట్ అయినా గాని… “RRR” రాజమౌళికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. కారణం చూస్తే “RRR” విడుదలైన సమయంలో ఓటిటి హవా నడుస్తోంది. దీంతో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై… రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టింది. నాన్ ఇంగ్లీష్ సినిమాగా అనేక రికార్డులు క్రియేట్ చేసింది.

Rajamouli received the best director award in New York
SS Rajamouli Won NYFCC Award

ఇదే సమయంలో అంతర్జాతీయంగా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంటుంది. దీనిలో భాగంగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు రాజమౌళి న్యూయార్క్ లో సొంతం చేసుకున్నారు. నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి అవార్డు అందుకోవటం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆయన లాల్చీ పైజామా ధరించగా.. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆస్కార్ అవార్డు కూడా రావాలని భారతీయ సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయంగా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. దీంతో నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా..భారీ బడ్జెట్ చిత్రం కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rajamouli received the best director award in New York
SS Rajamouli

పైగా ఈ సినిమా అత్యధిక అంతర్జాతీయ భాషలలో రిలీజ్ చేసే తరహా ప్లానింగ్ లో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో సీక్వెల్స్ విధంగా మహేష్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ రచయిత విజయేంద్రప్రసాద్ స్టోరీ సిద్ధం చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే నాడు రాజమౌళి మహేష్ సినిమా అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.


Share

Related posts

Anasuya: బుల్లి గౌనులో అన‌సూయ హాట్ అందాలు.. పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

kavya N

అందాల ఆర‌బోత‌లో హ‌ద్దులు దాటేసిన రాశి ఖ‌న్నా.. తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

kavya N

Rashmika Mandanna: విమర్శకులపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక మందన..!!

sekhar