RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి కాబోతున్నట్లు చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో మెగా అభిమానులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే “RRR” కి మూడో ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. విషయంలోకి వెళ్తే 2023 గోల్డెన్ గ్లోబ్ అంతర్జాతీయ అవార్డులకి ఉత్తమ చిత్రం, ఉత్తమ మ్యూజిక్ విభాగాలలో “RRR” నామినేట్ అయ్యింది. ఈ క్రమంలో ఆంగ్లేతర భాషలలో ఉత్తమ చిత్రం అవార్డు లభించింది.
దీనిపై ఎన్టీఆర్ స్పందించి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందే న్యూయార్ ఫిలిం క్రెడిట్ సర్కిల్ ఇంటర్నేషనల్ అవార్డు, అట్లాంటా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడోది గ్లోబల్ గోల్డ్ అవార్డు కూడా “RRR” కి రావటం సంచలనంగా మారింది. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లింది. రాజమౌళి పనితనం దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగేలా “RRR” నిరూపించింది.
ఈ సినిమా విజయంతో చాలామంది హాలీవుడ్ ప్రముఖులు మరియు నిర్మాణ సంస్థలు రాజమౌళితో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. తారక్ మరియు చరణ్ కెరియర్ లలో ఈ సినిమా ఓ మైలురాయి అని చెప్పవచ్చు. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లు రాబట్టిన సినిమాగా… హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఇదే తరహాలో ఆస్కార్ అవార్డు కూడా వస్తే బాగుంటుంది అని అభిమానులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఆశిస్తున్నారు.