RRR: “RRR” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి. జనవరి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది అని ఇండస్ట్రీ టాక్. ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవ్వని విధంగా “RRR” సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే నిన్న తమిళనాడులో(Tamilnadu) RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ యాంకర్.. డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) ని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది.
ఆ ప్రశ్నలలో ఒకటి… చరణ్, ఎన్టీఆర్(NTR) లలో ఎవరు గుడ్ బాయ్..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ ఇద్దరిలో కచ్చితంగా… చరణ్ (Charan)గుడ్ బాయ్…తారక్ బ్యాడ్ బాయ్ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. చరణ్ కి చాలా గౌరవం ఎక్కువ.. హుందాగా మాట్లాడతాడు. కానీ తారక్ మాత్రం మీద మీద పడిపోయి గౌరవం లేకుండా.. ఇష్టానుసారంగా మాట్లాడతాడు అందుకే నా దృష్టిలో చరణ్ గుడ్ బాయ్.. అంటూ రాజమౌళి(Rajamouli) కామెడీ యాంగిల్ లో సరదా సంభాషణ గా ఆన్సర్ ఇచ్చాడు.
ఇంకా అనేక విషయాల గురించి సినిమా హైలెట్స్ గురించి అదే రీతిలో సినిమాలో.. ఇద్దరు హీరోలు నటించిన విధానం మరియు పర్సనాలిటీ గురించి రాజమౌళి ఈ ప్రీ రిలీజ్ వేడుకలో కొత్త కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా లెవెల్ లో.. పలు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తమిళ భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మంచి రెస్పాన్స్ ప్రేక్షకులను నుండి లభించింది.