సినిమా

Chiranjeevi: మెగాస్టార్ ఔన్నత్యాన్ని మరోమారు చాటిచెప్పిన డైరెక్టర్ రాజమౌళి!

Share

Chiranjeevi: దర్శక ధీరుడు రాజమౌళి సందర్భానుసారంగా మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి చాటి చెబుతూ వుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ మాటలు విన్న వారికి కొన్ని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ పైన వున్న అపోహలు పటాపంచలు అయిపోయాయి.

Rajamouli, the director who once again showed the height of megastar Chiranjeevi !
Rajamouli, the director who once again showed the height of megastar Chiranjeevi !

Chiranjeevi: జక్కన్న చేసిన వ్యాఖ్యలు ఇవే

ముఖ్య అతిధిగా ఇక్కడికి విచ్చేసిన జక్కన్న ఈ వైదికపైన మాట్లాడుతూ… “మగధీర టైమ్‌లో చిరంజీవిగారు కథ వినడం జరిగింది. అప్పుడు రామ్‌ చరణ్‌ విషయాలన్నీ చిరంజీవిగారే దగ్గరుండి చూసుకుంటారేమో అని భ్రమ పడ్డాను. కానీ చరణ్‌కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తాజాగా తెలిసింది. చరణ్‌ నువ్వు ఇలా చెయ్‌ అలా చెయొద్దు అని ఆయన చెప్పరు. ఈ సినిమాలో నీ యాక్టింగ్‌ బాగుంది, నీ యాక్టింగ్‌ బాలేదని చెప్పరు. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్‌ తన సొంత నిర్ణయాలే.” అని చెప్పుకొచ్చారు.

Rajamouli, the director who once again showed the height of megastar Chiranjeevi !
Rajamouli, the director who once again showed the height of megastar Chiranjeevi !

తప్పులకైనా, ఒప్పులకైనా బాధ్యుడు అతడే

రాజమౌళి ఇంకా మాట్లాడుతూ.. “చరణ్ తను చేసిన తప్పులు తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాని నుంచి ప్రతీది నేర్చుకుని తనకు తానుగా సొంతంగా ఎదిగాడు. మెగాస్టార్‌ కొడుకైనా హార్డ్‌ వర్క్‌ చేసి ఎదిగాడు. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇలానే ఉండు చరణ్‌! నువ్వింకా ఎదగాలి. ఆయనంత కాకపోయినా తనకు సమానంగా ఉంటావు ఫ్యూచర్‌లో అని నేను గర్వంగా చెప్పగలను!” అంటూ జక్కన్న పేర్కొన్నాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి గురించి మాట్లాడుతూ నాకు ఆయనలోని కాంపటేటివ్‌నెస్‌ నచ్చింది. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్‌ చేయాలని చిరంజీవి కోరుకుంటారు.. అని చిరుని ఎత్తేసాడు.


Share

Related posts

Kalyani Priya Darshan Pictures

Gallery Desk

లేడీ విల‌న్‌తో బాల‌య్య‌

Siva Prasad

Acharya : ఆచార్య్‌లో పూజా హెగ్డే క్యారెక్టర్ ఇదేనా..?

GRK