సినిమా

Rajamouli Mahesh: మహేష్ మూవీ కోసం బాలయ్య ఫార్ములా వాడుతున్న రాజమౌళి..??

Share

Rajamouli Mahesh: “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” లతో తన డైరెక్షన్ పవర్ ఏంటో రాజమౌళి చూపించటం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు… అన్ని ఇండస్ట్రీలలో తిరుగులేని రికార్డులు రాజమౌళి క్రియేట్ చేయడం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్”..లో టేకింగ్ విజువల్ వండర్.. సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడేసింది. భాషతో మరియు దేశాల తో సంబంధం లేకుండా…”ఆర్ఆర్ఆర్” కి సినీ ప్రేమికులు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాజమౌళి.. నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ తో అని ప్రకటించడం తెలిసిందే. Will Balakrishna and Mahesh Babu team up for Rajamouli's next film? | Telugu Movie News - Times of Indiaఅయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు… స్టోరీ ఇంకా ఫైనల్ కానట్లు రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పైగా “ఆర్ఆర్ఆర్”, బాహుబలి కంటే మహేష్ ప్రాజెక్ట్.. భారీ ప్రాజెక్ట్ అని తెలియజేశారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా మహేష్ స్క్రిప్ట్ కోసం బాలయ్య ఫార్ములా రాజమౌళి వాడటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతోంది. మేటర్ లోకి వెళ్తే బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “ఆదిత్య 369” తరహాలో మహేష్ తో సినిమా చేయాలని జక్కన్న రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. Mahesh Babu - Rajamouli: మహేష్ బాబు సినిమాలో బాలకృష్ణ పాత్రపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. | Sensational Director Rajamouli given clarity on Mahesh Babu movie and will Balakrishna really to act in this ...1991లో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. టైం మిషన్ నేపథ్యంలో.. సరికొత్త స్క్రిప్ట్ తో కొత్తగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే మాదిరి స్టోరీతో మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు.. షికారు చేస్తున్నాయి. మరోపక్క స్టోరీ రైటర్ విజేయంద్రప్రసాద్ ఆఫ్రికా అడవులు నేపథ్యంలో కూడా యాక్షన్.. త్రిల్లర్ జోనర్ లో స్టోరీ సెట్ చేస్తున్నట్లు… మొన్న తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు రాజమౌళి “ఆదిత్య 369” మాదిరిగా టైం మిషన్ తరహాలో… మహేష్ తో.. మూవీ చేసే ఆలోచనలో.. ఉన్నట్లు సరికొత్త వార్త వినబడుతోంది.


Share

Related posts

Anchor Suma: నేను ఎవరి పొట్టా కొట్టడం లేదు.. ఆ విమ‌ర్శ‌పై సుమ ఫైర్‌!

kavya N

Cinema Tickets: జగన్ కి మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు! మూవీ టికెట్‌ రేట్స్ నిర్ణయించే అధికారం లేదని హెచ్చరిక!

Ram

‘అ’దో సెంటిమెంట్

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar