RRR: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉక్రెయిన్ దేశం పేరు మారబోతున్న సంగతి తెలిసిందే. రష్యా దేశం పక్కనే ఉండే ఈ దేశం పై మొన్నటి వరకు భీకరమైన యుద్ధం జరిగింది. రష్యా ఆక్రమణ లక్ష్యంగా బాంబులతో దాడి చేయడం జరిగింది. ఉక్రెయిన్ రాజధానిలో ప్రభుత్వ భవనాలను..టార్గెట్ గా చేసుకుని రష్యా మిలిటరీ దాడులతో రెచ్చిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం గురించి డైరెక్టర్ రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు.
“RRR” ఈనెల 25వ తారీకు విడుదల కానున్న తరుణంలో… ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్న నేపథ్యంలో … తాజా మీడియా సమావేశంలో రాజమౌళి ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు “RRR” చివరి షెడ్యూల్ అక్కడే జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ షెడ్యూల్ గురించి రాజమౌళి మాట్లాడుతూ అక్కడ షూటింగ్ అద్భుతంగా చేశాం. అటువంటి దేశంలో యుద్ధం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఉక్రెయిన్ దేశ ప్రజలు బాగా సహకరించారు.
అంతమాత్రమే కాదు వాళ్ళ ఫుడ్డు మరియు కల్చర్ కూడా బాగా నచ్చాయి. అటువంటి దేశంలో … యుద్ధం అనే వార్త గురించి వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పుకొచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనను కలిశాక మాకు ఎంతో సంతృప్తిగా ఉందని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో “RRR” …. కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర అనీ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ సినిమా ఎవరి జీవితచరిత్ర కాదు కేవలం ఫిక్షన్ సినిమా అని చెప్పుకొచ్చారు.