SSMB 29: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “SSMB 29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే “RRR” రాజమౌళికీ అంతర్జాతీయంగా మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఏకంగా ఈ సినిమా మూడు అంతర్జాతీయ అవార్డులు గెలవడంతో పాటు ఆస్కార్ రేసులో కూడా ఉంది. దీంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని నిర్మాణ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ(CAA).. రాజమౌళితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తెలియజేశారు. “RRR” తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించి జక్కన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.
మహేష్ ప్రాజెక్ట్ దాదాపు పది సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. గ్లోబల్ అడ్వెంచర్ ఫిలింగా ఈ సినిమా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో CAA వంటి నిర్మాణ సంస్థతో ఒప్పందం చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచ సినిమాలను అర్థం చేసుకునే కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా పరిచయం కావడం జరిగింది. ఇక ఇదే సమయంలో భారతీయ చలనచిత్ర రంగంలో సినిమాలు తీసే విధానం… అమెరికాలో ఫిలిం మేకింగ్ రెండు కూడా పూర్తిగా వ్యత్యాసంగా ఉంటాయి. అయితే CAAతో సినిమా చేసే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి ఏం చేయాలి.. అన్నదానికి సమయం ఉంది అని రాజమౌళి తెలియజేశారు. కాగా మహేష్ బాబుతో చేయబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిలిం ప్రాజెక్టుని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ CAA కూడా భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తారీకు విడుదల కానుంది. జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని ఆగస్టులోనే సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే మహేష్.. రాజమౌళి సినిమా అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు మే 31వ తారీకు ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పట్లో ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కావటంతో స్క్రిప్ట్ కూడా మరింత స్ట్రాంగ్ గా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!