NewOrbit
Entertainment News సినిమా

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మహేష్ సినిమాపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు..!!

Share

“బాహుబలి 2”, “RRR” లతో ఎస్ ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. ఈ ఏడాది ప్రారంభంలో “RRR” విడుదలయ్యి అనేక రికార్డులు సృష్టించింది. “RRR” ఓటిటిలో రిలీజ్ అయ్యాక ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి మంచి క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రాజమౌళిని భారీగా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఒక గుర్తింపు సెట్ అవ్వటంతో రకరకాల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి.

SS Rajamouli reveals genre of his next with Mahesh Babu | Telugu Movie News - Times of India

మహేష్‌తో సినిమా.. క‌థ ఏంటో చెప్పేసిన రాజ‌మౌళి!

Advertisements

తాజాగా అమెరికాలో అంతర్జాతీయ చిత్రోత్సవంలో రాజమౌళి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయబోయే దాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా ప్రపంచాన్నే కదిలించే యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఉండబోతుందని రాజమౌళి తెలియజేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్… త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది.

Mahesh Babu Joins Hands With SS Rajamouli for His Next Globetrotting Action Adventure | LatestLY

సోమవారం నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్ అయిన వెంటనే వచ్చే ఏడాది ప్రారంభంలోనే రాజమౌళి సినిమా చేయటానికి మహేష్ రెడీ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్.. స్క్రిప్ట్ వర్క్ లో నిమగ్నమైనట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా.. “RRR” , “బాహుబలి” సినిమాల కంటే హై బడ్జెట్ తో నిర్మించనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ ఎత్తున ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

kavya N

విక్రమ్ సంచలన నిర్ణయం

Siva Prasad

Intinti Gruhalakshmi : తులసికి అంకిత సారీ చెప్పడానికి ఇంత చేసిందా..!? లాస్య ట్రాప్ లో అభి చిక్కుకున్నాడా..

bharani jella