35.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: “RRR” చేయడానికి ఆ రెండు సినిమాలే స్ఫూర్తి రాజమౌళి సంచలన వ్యాఖ్యలు…!!

Share

RRR: గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. “బాహుబలి” సినిమాతో ప్రపంచ దృష్టినీ ఆకర్షించిన రాజమౌళి ఈ సినిమాతో కూడా సత్తా చాటారు. ఇండియాలో ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో VFX గ్రాఫిక్స్ వర్క్ సినిమా చూసే ప్రేక్షకుడని ఎంతగానో ఆకట్టుకుంది. పులితో ఎన్టీఆర్ ఫైట్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ట్రైన్ ప్రమాదం సమయంలో పిల్లాడిని కాపాడే సన్నివేశం సినిమాలో చాలా హైలెట్ అయ్యాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కైవసం చేసుకుంది. ముఖ్యంగా “నాటు నాటు” పాట దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా క్రేజ్ దక్కించుకుంది.

Rajamouli's sensational comments inspired those two movies to make RRR

ప్రస్తుతం ఈ సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. దీంతో అందరూ “RRR”కీ ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా చేయటానికి రెండు సినిమాలు స్ఫూర్తి అని ఇటీవల రాజమౌళి స్పష్టం చేశారు. తెలుగులో “మాయాబజార్” హాలీవుడ్ ఇండస్ట్రీలో “పాషన్ ఆఫ్ ది క్రైస్ట్.. “RRR” సినిమా చేయడానికి ప్రేరణ కలిగించిందని పేర్కొన్నారు. “మాయాబజార్” వర్తమాన భాషకు దగ్గరగా ఉండటంతో..పాటు తెలుగు పరిశ్రమలో చాలామంది నటించారని పేర్కొన్నారు. అందుకే ఆ సినిమా స్ఫూర్తిగా తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక “పాషన్ ఆఫ్ ది క్రైస్ట్”… కొమరం భీముడో సాంగ్ లో కొరడాతో కొట్టే సన్నివేశానికి స్ఫూర్తి అని తెలియజేయడం జరిగింది.

Rajamouli's sensational comments inspired those two movies to make RRR

దీంతో జక్కన్న చేసిన తాజాగా సంచలనం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే “RRR” కీ రెండో భాగం కూడా రాబోతున్నట్లు రాజమౌళి తెలియజేయడం జరిగింది. సెకండ్ పార్ట్ కీ సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్లాన్ చేస్తున్నట్లు త్వరలో వెల్లడించినట్లు గతంలో తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మంచి ఆదరణ రావటంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై రాజమౌళి ఫుల్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.


Share

Related posts

Adipurush: ప్రభాస్ బర్త్ డే నాడు “ఆదిపురుష్” నుండి మరో బిగ్ సర్ ప్రైజ్..!!

sekhar

మళ్ళీ గొడవ పడతారేమో ..?

GRK

బండ్ల‌గ‌ణేష్ అరెస్ట్‌

Siva Prasad