Rajanikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి చాలాకాలం అయిపోయింది. 2.0 తర్వాత రజిని చేసిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవల చేసిన “పెద్దన్న” సినిమా కూడా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా రజినీ కెరీర్లో ఇది నూట అరవై తొమ్మిదొవ సినిమా. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో రకరకాల పేర్లు ఇటీవల వినబడ్డాయి.
నాగార్జున నటించిన సినిమా “బాస్” అనే టైటిల్ రజినీ మూవీకి పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో వస్తున్న వార్తలకు మేకర్స్ చెక్ పెడుతూ అసలు టైటిల్ ప్రకటించడం జరిగింది. “జైలర్” అనే టైటిల్ ప్రకటించారు. పోస్టర్ లో గొలుసుకి కత్తి వెల్లడిస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా టైటిల్ ప్రకటన చేయడం జరిగింది. పోస్టర్ లో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
పోస్టర్ బట్టి చూస్తే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలో రజనీ సరసన హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హీరోయిన్ విషయంలో కూడా త్వరలో క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో రజినీ నీ డైరెక్టర్ నెల్సన్ చూపించనున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన “బీస్ట్” అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో రజినీ ఫాన్స్ తాజా ప్రాజెక్టు పై కొంత టెన్షన్ పడుతున్నారు. మరి నెల్సన్ రజినీకి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…