Chandramukhi 2: రజనీకాంత్ కెరీర్ లో “చంద్రముఖి” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 2005వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పి.వాసు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో.. అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ అందించిన సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ పి వాసు. గతంలో రజనీకాంత్ తోనే సీక్వెల్ చేయాలని.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించాలని పి.వాసు చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కాలేదు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఇప్పుడు పి.వాసు హీరో లారెన్స్ తో సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యారు. అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. చంద్రముఖి మేడగదికి సంబంధించిన రీతిలో.. “చంద్రముఖి 2” పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. లైక ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ.. ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటువంటి సబ్జెక్టు గతంలో లారెన్స్ నటించిన “కాంచన”, “కాంచన 2” బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.
దీంతో చంద్రముఖి వంటి బిగ్గెస్ట్ థ్రిల్లర్ నేపథ్యం కలిగిన సినిమాని.. లారెన్స్ తో సీక్వెల్ చేయటానికి పి.వాసు రెడీ అవ్వడం సంచలనంగా మారింది. లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని కావడంతో… చంద్రముఖి సీక్వెల్ చేయటానికి ముందుకు రావడంతో రజినీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్.. స్టార్ట్ చేయనున్నారు. చాలా తక్కువ టైంలోనే సినిమాని కంప్లీట్ చేసే రీతిలో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వేసవికీ విడుదల అయ్యే విధంగా నిర్మాతలు మరియు దర్శకులు ఆలోచన చేస్తున్నారు. చంద్రముఖి అప్పట్లో ఎన్ని భాషల్లో రిలీజ్ అయిందో.. “చంద్రముఖి 2” కూడా అనే భాషల్లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.