Shivani Rajasekhar: తెలుగు చలనచిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో సీనియర్ హీరో రాజశేఖర్ జీవిత దంపతులకు గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటన చేసిన టైంలో.. రాజశేఖర్ మరియు జీవిత చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు కోపం తెప్పించాయి. ఆ సమయంలో వాళ్ళ పై అభిమానులు దాడులు కూడా చేయడం జరిగింది. దీంతో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు తెలియజేశారు. అప్పటినుండి రాజకీయంగా ఈ రెండు కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. ఒకసారి “మా” అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో సైతం చిరంజీవి మరియు మోహన్ బాబు పై రాజశేఖర్ కొద్దిగా అగ్రహంగా కూడా మాట్లాడటం జరిగింది.
ఇదిలా ఉంటే రాజశేఖర్ కూతురు శివాని ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగు తో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తూ ఉంది. తాజాగా ఆమె నటించిన కోటబొమ్మాలి ఈనెల 24వ తారీఖు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, శివాని, రాహుల్, శ్రీకాంత్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శివాని మెగా ఫ్యామిలీతో గొడవలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెగా ఫ్యామిలీకి మా కుటుంబానికి కొన్ని వివాదాలు అయితే జరిగాయి. కానీ పాలిటిక్స్ ఉన్నప్పుడు అలాంటివి సర్వసాధారణం. అవసరమైనప్పుడు మాత్రం కచ్చితంగా అందరం కలిసి పోతాం. మేమంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ప్రొఫెషనల్ వేరు వ్యక్తిగత జీవితాలు వేరుగానే ఉంటాయి.
గతంలో ఎప్పుడో చిన్నచిన్న గొడవలు జరిగిన కూడా వాళ్ల ప్రొడక్షన్ లో నేను నటించకూడదని రూలేమీ లేదు కదా మా ప్రొడక్షన్ లో వాళ్లు నటించకూడదని రూలేం లేదు. అంతేకాదు అమ్మానాన్నలు అరెస్టు అయ్యారు అంటూ ఒక్కొక్కరు ఒక్కోరకంగా కథనాలు రాస్తున్నారు. దాంతో ఏవేవో రూమర్స్ బయట ప్రచారంలో ఉన్నాయి. ఒకటి జరిగితే ఇంకొకటి బయటకు వచ్చింది. మా అమ్మానాన్నలు జైలుకెళ్లలేదు ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. వాళ్లు చాలా స్ట్రాంగ్ మనుషులు. వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మాకు మాత్రమే తెలుసు. రకరకాల రూమర్స్ వస్తుంటాయి పోతుంటాయి మేము సిన్సియర్ గా పని చేసుకుంటూ ముందుకెళతాం” అంటూ శివాని రాజశేఖర్ రెడ్డి వల్ల స్పష్టం చేయడం జరిగింది.