Balakrishna Rajasekhar: నందమూరి బాలయ్య బాబు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలు చేస్తూ ఇంకా ఓటిటిలో కూడా దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్య బాబు గత ఏడాది డిసెంబర్ లో “అఖండ” తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇప్పటివరకు ఒక ఫ్లాప్ కూడా లేని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్టు కూడా ఓకే చేయటం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లో బాలయ్య బాబుతో పాటు హీరో రాజశేఖర్ నటించనున్నారట.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా రాజశేఖర్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే బాలయ్య సినిమాలో విలన్ పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నట్లు సమాచారం. గతంలో రాజశేఖర్.. ఎక్కడా కూడా విలన్ పాత్రలు చేసిన దాఖలాలు లేవు. అంతమాత్రమే కాదు బలరామకృష్ణులు తర్వాత రాజశేఖర్ మల్టీ స్టారర్ కూడా చేయలేదు. ఈ క్రమంలో చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం విలన్ పాత్రలో అది కూడా బాలయ్య బాబు సినిమాలో రాజశేఖర్ నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సినిమా స్టోరీ ఉండనున్నట్లు టాక్. అయితే బాలయ్య కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించనుందని ఇండస్ట్రీ టాక్. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి విలన్ పాత్రలు మరియు హీరో సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా నడుస్తోంది. మరి హీరో రాజశేఖర్ కి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…