Rajinikanth: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం “అన్నాత్తే” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే ఇక పూర్తిగా సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో రజినీకాంత్ వున్నట్లు తమిళ మీడియా వర్గాలు వార్తలు వైరల్ చేస్తూ ఉన్నాయి. ఇటీవలే రజిని “అన్నాత్తే” సినిమా యూనిట్ తో తన రిటైర్మెంట్ గురించి చర్చించడం జరిగినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో పూర్తయింది.
ఈ సమయంలోనే సినిమా యూనిట్ కి మొత్తం భారీ ఎత్తున రజినీకాంత్ పార్టీ ఇచ్చినట్లు.. దీంతో గతంలో ఏ సినిమాకి లేనివిధంగా రజిని హడావిడి చేయడంతో తమిళ మీడియా రజిని రిటైర్మెంట్ ఇచ్చినట్లు పేర్కొంది. 1975 సంవత్సరం నుండి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రజినీకాంత్ అంతకుముందు బస్ కండక్టర్ గా పని చేసేవారు. దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 160 కి పైగా సినిమాలు చేయడం జరిగింది. అయితే ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో పాటు.. కరోనా బారిన పడటంతో.. ఇక పూర్తిగా రెస్ట్ తీసుకునే ఆలోచనలో రజినీకాంత్ వున్నట్లు సమాచారం.
Read More: Rajinikanth-Mohan Babu: రజినీ-మోహన్ బాబు..ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్..!
రిటైర్మెంట్ కాలం మొత్తం ఎక్కువగా అమెరికాలో గడపాలని .. చాలా ప్రశాంతంగా ఉండాలని తలైవా అనుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి గత ఏడాది రజినీకాంత్ రాజకీయ రంగంలోకి రావాలని .. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. సరిగ్గా పార్టీ ప్రకటించే టయానికి ఒక్కసారి అనారోగ్యం పాలు కావడంతో .. తాను రాజకీయాల్లోకి వెళ్ళటం భగవంతుడు ఇష్టంలేదని అభిమానులకు క్షమాపణలు చెప్పి .. పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు సినిమా రంగానికి కూడా రజిని దూరం అయ్యే విధంగా వార్తలు రావడంతో ఆయన అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?