Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కొద్దిగా అనారోగ్యానికి గురి అయిన తర్వాత మళ్లీ రికవరీ కావడం తెలిసిందే. అంతకుముందు ఏడాది పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు రావటం మాత్రమే కాదు రజిని కూడా ప్రకటించడం చివరి నిమిషంలో వెనక్కి తగ్గటం తెలిసిందే. రజినీ వస్తాడని చాలామంది భావించారు. అభిమానులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారని కచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు రజినీకి ఉన్నాయని అభిమానులంతా ఎంతగానో ఎప్పటి నుండో ఎదురు చూశారు. కానీ చివరి నిమిషంలో అనారోగ్యానికి గురికావడంతో.. ఇది భగవంతుడి నిర్ణయం కాదని రజినీ వెనక్కి తగ్గటం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే రోబో సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో ఎప్పటి వరకు రజిని సరైన సినిమా తీయలేక పోవడం జరిగింది. 2016 లో వచ్చిన “కబాలి” దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన “పేట”.. పర్వాలేదనిపించింది. మళ్లీ కొన్నాళ్లకు వచ్చిన దర్బార్, పెద్దన్న సినిమాలు అభిమానులను ఏమాత్రం ఆశించ లేకపోయాయి. దీంతో ప్రస్తుతం రజనీకాంత్ సూపర్ డూపర్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో “డాక్టర్” వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన నెల్సన్ దర్శకత్వంలో రజిని సినిమా చేయడానికి రెడీ కావడం తెలిసిందే.
అయితే ఈ సినిమాకి రజనీ కాంత్ తానే రచయితగా స్టోరీ రాసుకున్నట్లు తమిళ మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి. రజనీ కేరియర్ లో 169 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మరోపక్క రజనీ అభిమానులు ఈ సినిమా పై టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే నెల్సన్… విజయ్ హీరోగా తీసిన బీస్ట్ దారుణంగా ఫ్లాప్ కావడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో వరుస పరాజయాలతో ఉన్న రజినీకాంత్… నెల్సన్ దర్శకత్వంలో సినిమా చేయటం సాహసమే అని అంటున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!