తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించిన టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్లో కూడా రాణించాలని ఐదారేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ఈమె నటించిన `దేదే ప్యార్ దే ` చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా రకుల్ చాలా గ్లామర్‌గా ఉందంటూ అందరూ కితాబిచ్చారు. ఈ సందర్బంగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రకుల్ పెద్ద ఇంటర్వ్యూనే ఇచ్చింది. ఈ సందర్భంగా మీరు హీరోను పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఎవరిని చేసుకుంటారు. అని అడిగిన ప్రశ్నకు రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంటానని ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. రణవీర్‌లో ఉన్న ఎనర్జీని చూసి తాను షాక్ అవుతానని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది రకుల్.
previous post
next post