రజనీకాంత్‌కు.. హిమాలయలంటే ఇష్టం. ఏమాత్రం ఖాళీ ఉన్నా కూడా ఆయన హిమాలయాలకు వెళ్లి అక్కడ సాధువులను కలుస్తుంటారు. సమాచారం ప్రకారం ఈయన తర్వలోనే హిమాలయాలకు వెళ్లబోతున్నారట. ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. చిత్రీకరణ తర్వాత వీలైనంత త్వరగా డబ్బింగ్ పూర్తి చేసి రజనీ హిమాలయాలకు వెళతారు. అక్కడ పది రోజులు పాటు గడిపి, వస్తారట. తర్వాతే తదుపరి సినిమాల గురించి ఆలోచనలు చేస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
previous post
next post