సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రెండో అల్లుడు విశాఖన్ని నటుడిగా నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నాలను మొదలు పెట్టారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అందులో భాగంగా తనతో ‘పేట’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ను కలిశారు రజనీ. అల్లుడు విశాఖన్‌తో సినిమా చేయాలని కోరాడట. సూపర్‌స్టార్ అంతటి వ్యక్తి కోరితే ఏ దర్శకుడు కాదంటారు చెప్పండి.. వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. త్వరలోనే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో విశాఖన్ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్.. ధనుష్‌తో సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాతే విశాఖన్‌తో సినిమా చేస్తాడట.
previous post
next post