Rakul preet singh: రకుల్ ప్రీత్ సింగ్ Rakul preet singh: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సక్సెస్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈక్రమంలో టాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్సే చూసినా ఆమె క్రేజ్ తగ్గలేదు. వరుసగా అవకాశాలు రావడం.. క్రేజ్ ఉండటంతో హిందీ సినిమాలు చేస్తోంది. ఈక్రమంలో ఓ హిందీ వెబ్ సైట్ లో ఆమెకు తెలుగులో సినిమాలు లేవని.. ఫ్లాపులతో దూరమైందని రాసింది. దీంతో రకుల్ సీరియస్ అయింది.. వారికి కౌంటర్ కూడా ఇచ్చింది.
‘ఏడాదిలో 365 రోజులే ఉంటాయి. ఎవరైనా ఒక ఏడాదిలో ఆరు సినిమాల కంటే ఎక్కువ చేస్తారేమో చెప్పండి. ఒకవేళ చేసేందుకు మీరేమైనా టైమ్ ఎడ్జస్ట్ మెంట్ చేయగలరేమో చెప్పండి’ అంటూ ట్వీట్ చేసి ఘాటు కౌంటర్ ఇచ్చింది. రకుల్ కు స్టార్ డైరక్టర్ హరీశ్ శంకర్ మద్దతిచ్చాడు. ‘రకుల్ ఎంత బిజీ ఆర్టిస్టో నాకు తెలుసు. ఆమె డేట్స్ దొరక్క నా ఫ్రెండ్ ఎంత వెయిట్ చేశాడో నాకు తెలుసు. ఆమె డేట్స్ లేని కారణంగానే ఆ సినిమా కూడా వాయిదా పడింది. తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చినా ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది. నువ్వెంత బిజీనో చెప్పాల్సిన అవసరం లేదు. నీ పనే సమాధానం చెప్తుంది’ అంటూ స్పందించాడు.
Read More: Nayanthara: నయన్ తో ఇష్టమైన ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్..! నెట్టింట్లో వైరల్..
నిజానికి రకుల్ కు టాలీవుడ్ లో ఆఫర్స్ లేవు. వైష్ణవ్ తేజ్ తో క్రిష్ దర్శకత్వంలో చేసిన సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె హిందీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఈక్రమంలో తెలుగు సినిమాలకు అడ్జస్ట్ చేయలేకుండా ఉంది. పైగా కొత్త సినిమా ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతూండటం వల్ల ఆమకు ఆఫర్లు దక్కే అవకాశం ఉంది. తెలుగులో రకుల్ క క్రేజ్ ఉంది. కొన్ని ఫ్లాపుల వల్ల ఆమె వెనుకబడిందని చెప్పాలి. ఒక్క హిట్ దక్కితే మళ్లీ రకుల్ హవా టాలీవుడ్ లో కొనసాగడం ఖాయమే.